వైఎస్‌ఆర్‌కి షర్మిల నివాళులు..పార్టీ విలీనంపై కీలక ప్రకటన

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంకగాంధీ టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. నేడు వైఎస్‌ జయంతి సందర్భంగా షర్మిల, సీఎం జగన్ సహా కుటుంబ సభ్యులు అంతా ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఎవరికి వాళ్లు వేర్వేరుగా బయల్దేరి వైఎస్‌ సమాధికి నివాళి అర్పించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.

New Update
వైఎస్‌ఆర్‌కి షర్మిల నివాళులు..పార్టీ విలీనంపై కీలక ప్రకటన

Sharmila key announcement on party merger today

విలీనంపై క్లారిటీ

వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంకగాంధీ టీంతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్ నేతలతో భేటీలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ టాక్‌పై ఇడుపులపాయ వేదికగా ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Sharmila key announcement on party merger today

వైఎస్‌కు ఘన నివాళులు

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా గతేడాది వరకు అంతా కలిసి ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేవాళ్లు. కానీ ఈసారి ఎవరికి వారుగానే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్ననే షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ ఉదయమే తల్లి విజయమ్మతో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు.అంనతరం తిరుగుపయనమవుతారు. సీఎం అయితే మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. తండ్రి సమాధికి నివాళి అర్పిస్తారు. రెండేళ్లుగా చెల్లి షర్మిలతో విభేదాలు కారణంగా ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతేడాది ఇద్దరూ కలిసి నివాళి అర్పించిన‌ప్పటికీ ముబావంగానే ఉన్నారు. ఈసారి మాత్రం వేర్వేరుగా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

బిడ్డలపై ఆస్తుల రిజిస్ట్రేషన్‌

శుక్రవారమే కడప చేరుకున్న వైఎస్‌ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు మీద ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. మరో 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకొని అక్కడే రాత్రి షర్మిల బస చేశారు.

చెరగని ముద్ర వైఎస్‌ఆర్‌

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌పై షర్మిల కామెంట్స్ చేశారు. పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత వైఎస్ అన్నారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు షర్మిల. నిత్యం ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహనేత వైఎస్‌.. ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువబోరనన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకురాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షరాలు షర్మిల అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు