కడపలో ముగిసిన సీఎం జగన్ పర్యటన ఏపీ సీఎం జగన్ నేడు కడప జిల్లాలో మూడో రోజు పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకోని ప్రజాప్రతినిధులతో సమావేశమైయ్యారు. అనంతరం రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బయలుదేరి కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. By Vijaya Nimma 10 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి ముగిసిన టూర్ సీఎం జగన్ మూడు రోజుల కడప పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి తిరిగి బయల్దేరారు సీఎం జగన్. కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర సీఎం శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం స్థానిక నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం 12 కోట్ల రూపాయలతో ఆధునికరించిన రాజీవ్ మార్గ్ రోడ్డు ప్రారంభోత్సవం పాల్గొని అక్కడే నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నగరానికి శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అమృత్ పథకం నిర్మాణానికి .. ఆ పనులతో పాటు మొత్తం 760 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేసి.. అక్కడి నుంచి నూతన హంగులతో పునఃనిర్మించిన రాజీవ్ పార్క్ ప్రారంభోత్సవం చేశారు. తిరిగి ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా కోప్పర్తి వెళ్లిన సీఎం.. కొప్పర్తి జగనన్న పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన అల్ డిక్సన్ సీసీ కెమెరాలు తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కొప్పర్తి హెలిప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి కడప విమానాశ్రయం చేరుకోని గన్నవరంకు బయలుదేరారు సీఎం జగన్. దీంతో సీఎం కడప టూర్ ముగిసింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా.. సీఎం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడం సంతోషమని, ఒబెరాయ్ గ్రూప్ ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్ కడుతోందని అన్నారు. ఒబెరాయ్ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి