Perni Nani : పేర్ని నాని ఇంటి దగ్గర హైటెన్షన్ AP : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్‌పై పేర్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. By V.J Reddy 26 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Perni Nani: మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తల ఆందోళనకు దిగారు. లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్‌పై పేర్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా పవన్‌పై పేర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తల డిమాండ్ చేస్తున్నారు. పేర్ని ఇంటి ముందే కూర్చుని ఆందోళన చేపట్టారు. లోపలకు వెళ్లేందుకు కార్యకర్తల ప్రయత్నం చేశారు. జనసేన కార్యకర్తలకు పోటీగా పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలతో కలిసి నిరసన చేశారు. పేర్ని నాని ఇంటి వద్ద పెద్దయెత్తున పోలీసులు మోహరించారు. పవన్ కు నాని వార్నింగ్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. పవన్ నీ ఉడత ఊపుడుకి భయపడేది లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కి, జనసేన కార్యకర్తలకు వైసీపీ భయపడదని చెప్పారు. సినిమాల్లో నాలుగు డ్యాన్సులు వేసి రాజకీయాల్లోకి వచ్చావు అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ కి ఒక సిద్ధాంతం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోవాలని అన్నారు. Also Read : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్ #pawan-kalyan #Tirupati Laddu #janasena #perni-nani సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి