మత్తు మందు ఇచ్చి భార్యపై అతి దారుణంగా.. ఛీ ఛీ వీడసలు భర్తేనా..!

భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. గ్యాస్‌స్టవ్‌ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కానీ ఆమె బతికే ఉండటంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

New Update
husband tried to kill his wife

అతడొక తాగుబోతు భర్త. రోజూ తాగొచ్చి ఇంట్లో తన భార్యతో గొడవ పడుతుంటాడు. తాగుడుకి తోడు విపరీతమైన అప్పులు. ఒక మనిషికి ఏ అలవాటు అయితే ఉండకూడదో.. అవే అలవాట్లు అతడికి ఉన్నాయి. అప్పు చేయడం, తాగడం చేస్తుండేవాడు. ఇక అప్పులు తీర్చేందుకు భార్య బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాడు. 

Also Read:చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. రూ.200 లకే 90 రోజుల వ్యాలిడిటీ!

ఇలా చేస్తుంటే ఏ భార్య అయినా చూస్తూ ఊరుకోదు. ఇక ఆమె కూడా ఊరుకోలేదు. తాగుబోతు భర్తను ప్రశ్నించింది. కూతురి పుట్టిన రోజు వస్తుంది. బంగారాన్ని విడిపించుకుని తీసుకురండి అని భార్య అతడితో గొడవపడింది. దీంతో కోపగ్రస్తుడైన తాగుబోతు భర్త ఓ రోజు డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చాడు. ఆ విషయం తెలియక డ్రింక్ తాగిన ఆమె వెంటనే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అతడు చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు. విషయం తెలిసి ఊరు ఊరంతా అతడు చేసిన పనికి దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ అతడు ఏం చేశాడు. అనే విషయానికొస్తే.. 

Also Read:ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

పక్కా ప్లాన్ ప్రకారమే

ఏపీ విశాఖపట్నంలోని మురళీనగర్ సింగరాయ కొండపై వెంకటరమణ, కృష్ణవేణి దంపతులు నివశిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక వెంకటరమణ మద్యానికి బానిస కావడంతో అప్పులు బాగా ఉన్నాయి. అదే సమయంలో భార్య బంగారాన్ని సైతం తాకట్టు పెట్టాడు. దీని కారణంగానే తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక నవంబర్ 23న కూతురి పుట్టిన రోజు నాటికి బంగారాన్ని విడిపించి తీసుకురావాలని భార్య తల్లిదండ్రులు పట్టుబట్టారు. 

Also Read:సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!

దీంతో ఏం చేయాలో తెలియని వెంకటరమణ తన భార్యను హతమార్చాలనుకున్నాడు. దీంతో నవంబర్ 16న రాత్రి తాగొచ్చి తనతో పాటే మత్తుమందు కలిపి తెచ్చిన కూల్‌డ్రింక్‌ను భార్యకు ఇచ్చాడు. ఆమె తాగి వెంటనే కళ్లుతిరిగి పడిపోయింది. దీంతో అతడు తనతో తెచ్చుకున్న మంటలు అంటుకునే పొడిని ఆమెపై చల్లి నిప్పంటిచ్చాడు. తలుపులు మూసేశాడు.

Also Read:తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

కళ్ల ముందే భార్య కాలిపోతున్నా తలుపులు తీయలేదు. ఇక మత్తు ప్రభావం నుంచి అప్పుడే కోలుకుంటున్న ఆమె వెంటనే తనకు అంటుకున్న మంటలు చూసి ఒక్కసారిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉండటంతో.. జరిగిన విషయాన్ని చెప్పటంతో పోలీసులు రంగంలోకి దిగి వెంకటరమణపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు