/rtv/media/media_files/2025/09/07/west-2025-09-07-13-45-21.jpg)
పశ్చిమగోదావరిలో దారుణం జరిగింది. తాడేపల్లిగూడెం జువ్వలపాలెంలో హత్యయత్నం చోటుచేసుకుంది. చర్చిలో భర్త లక్ష్మణరావు అతని భార్య మర్రిపూడి సంగీత (33)పై కత్తితో దాడికి దిగాడు. ఏకంగా ఐదు సార్లు దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా హాస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య గల కారణాలు సేకరించారు. దుబాయ్ లో పని చేసి రెండు నెలలు క్రితమే ఇంటికి వచ్చింది సంగీత. ఆమె భర్త లక్ష్మణ్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పదిరోజుల క్రితమే పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది. మరోసారి ఇంట్లో గొడవలు జరగడంతో ఈ రోజు చర్చ్ కు వెళ్ళి భార్యను హత్య చేయాలకున్నాడు లక్ష్మణరావు. ప్లాన్ లో భాగంగా ఆమెపై దాడికి దిగాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.