TTD: రెండు మూడు గంటల్లో  శ్రీవారి దర్శనం ఎలాగో తెలుసా!

తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి సామాన్యులకు 20-30 గంటల సమయం పడుతోంది. ఏఐ సహకారంతో రెండు మూడు గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోనే యోచనలో టీటీడీ అధికారులు ఉన్నారు.

New Update
TTD 2

TTD: కలియుగ దైవం తిరుమలేశుని దర్శనార్థం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దీనికోసం  భక్తుల కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జితసేవలు ,స్లాట్‌ దర్శనం, సర్వ దర్శనం అని పలు రకాలుగా ఉన్నాయి.

Also Read: Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా

భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులుకావడం గమనార్హం. రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్‌ లోనే దాదాపు 30 గంటలు స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. స్లాట్‌ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఆధార్‌ కార్డు ద్వారా దర్శన సమయం కేటాయిస్తారు. 

Also Read: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఈసారి ఆ సంస్థతో కలిసి

దీంతో రెండు , మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. అయితే ఈ టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి కాలి నడకన వచ్చే భక్తులకు గతంలో దివ్య దర్శనం అనే పేరుతో కొన్ని టికెట్లను కేటాయించే వారు. ఇందులో భాగంగా 2,3 గంటల్లోనే దర్శనం చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది.

Also Read:  GROUP 3: సగం మంది గ్రూప్‌ 3 పరీక్షలకు డుమ్మా

రిస్ట్‌బాండ్‌ తరహాలో...

రెండు దశాబ్దాల కిందట ఐవీ సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం ప్రతి భక్తుడి చేయికి రిస్ట్‌బాండ్‌ తరహాలో ఒక కంకణాన్ని ట్యాగ్‌ చేస్తారు. ఈ కంకణం వాటర్‌  ఫ్రూఫ్‌ తరహాలో ఉంటుంది.

Also Read: Rahul Gandhi: కులగణనపై రాహుల్‌గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు

దీన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణిగుంట వంటి ప్రాంతాల్లో చేతికి వేసేవారు.దీంతో  ఈ విధానంతో మనకు కేటాయించిన సమయానికి వెళ్లి రెండు , మూడు గంటల్లో దర్శనం చేసుకొని రావచ్చు. ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈ అంశాన్ని గతంలో ప్రస్తావించారు. దీన్నే తిరిగి అమలు చేసే అవకాశాలున్నాయి.

30 సంవత్సరాల క్రితం వరకు సామాన్య భక్తుడు కూడా మూల విరాట్‌ ని అత్యంత సమీపంగా అంటే కులశేఖరుడి పడి వరకు వెళ్లి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం వీఐపీలు, రూ.10,500 దర్శనాలకు మాత్రమే అక్కడి వరకు అనుమతినిస్తున్నారు.

ఆ తరువాత కాలంలో లఘుదర్శనం అని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం  గరుడాళ్వార్‌ సన్నిధి నుంచిజయవిజయులను దాటి స్నపన మండపం వరకు వెళ్లి దర్శించుకునేవారు. తరువాత దీన్నికూడా రద్దు చేసి గరుడాళ్వార్‌ సన్నిధి నుంచి దర్శనం అందిస్తున్నారు. 

దీనికి మహాలఘు దర్శనం అని పేరు పెట్టారు. దీన్ని పాలక మండలి పరిగణలోకి తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు