/rtv/media/media_files/2025/04/09/3KLURG1zJ1CnNXl9qRFX.jpg)
Mark’s Health Update
Mark’s Health Update : సింగపూర్‌లో ఓ సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగ చేరింది. దీంతో మార్క్ శంకర్‌ను ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు కూడా ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. మరో మూడు రోజులు మార్క్ శంకర్‌ను ఆస్పత్రిలో ఉంచనున్నట్లు తెలిసింది.
Also read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై పవన్ టీం హెల్త్ అప్‌డేట్ విడుదల చేసింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం కూడా మంగళవారం రాత్రి సింగపూర్ వెళ్లారు. అయితే అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. మార్క్ శంకర్‌ను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు మార్చినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. మార్క్ శంకర్ ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనీ.. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకుని నేరుగా ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
పవన్ కళ్యాణ్ వచ్చే సమయానికి మార్క్ శంకర్‌కు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం బయటకు తీసుకువచ్చినట్లు తెలిపింది. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తులలోకి పొగచేరింది. మార్క్ శంకర్‌కు మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని.. అలాగే వైద్యుల పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు పవన్ కళ్యాణ్ కుటుంబానికి తెలియజేసినట్లు పవన్ కళ్యాణ్ టీమ్ తెలిపింది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు తీసుకువచ్చారని.. మరిన్ని పరీక్షలు చేయడంతో పాటుగా మూడురోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్లు తెలిపింది.
Also Read: బయటపడిన ఫేక్ డాక్టర్.. ఒకే నెలలో ఎంతమంది మృతి చెందారంటే?
Follow Us