Tirmala: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. తిరుమలలో భారీ వర్షాల నేపథ్యంలో మాడా వీధులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!
గత కొన్నిరోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాల వల్ల చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ఘాట్ రోడ్ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.దీంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. దీంతో టీటీడీ ఈవో శ్యామలరావు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?
ఆయన సూచనలతో అప్రమత్తమైన అధికారులు భక్తులకు వసతి,దర్శనం, ప్రసాదాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్డులో కొండ చరియలు జారీ పడే ప్రాంతాల్లో అధికారులు నిఘాను పెంచారు.
Also Read: Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..!
రోడ్డుకి అడ్డంగా పడే కొండచరియలను ఎప్పటికి అప్పుడు తొలగించేందుకు జేసీబీలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తిరుమలలో భక్తులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాల అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేశారు.భారీ వర్షాలకు తిరుమలలో టీటీడీ అప్రమత్తమై ముందస్తు చర్యలను చేపట్టింది.
Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇప్పుడు శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీద ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఇవాళ ప్రకాశం, కడప, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, అన్నమయ్య ,నెల్లూరు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు అల్పపీడన ప్రభావం ఉన్నా సరే రాష్ట్రంలో చలి తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 9 తర్వాత మాత్రమే ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.