ఫుడ్ పాయిజన్ కుట్ర ఆర్‌ఎస్పీదే.. వెలుగులోకి సంచలనాలు! పిల్లల ఫుడ్ పాయిజన్ ఎవడు చేశాడో త్వరలో తేలుస్తామని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అధికారుల హస్తం ఉంటే ఉద్యోగం తొలగిస్తామన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ కుట్ర ఆర్‌ఎస్పీదేనని బండ్రు శోభారాణి ఆరోపించారు. By srinivas 28 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Telangana: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్రంలో పొలిటికల్‌గా హీట్‌ను రాజేస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ కామెంట్ చేశారు. ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు. మరోవైపు గురుకులాల మీద పాలిటిక్స్ చేయొద్దని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాణ్యత లో లోటు ఉంటే చర్యలు.. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూం నివాసాల వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణలో పాఠశాల గ్రౌండ్, వంటగది, బాత్ రూమ్లను పరిశీలించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 50 శాతం రెంట్‌లు పూర్తి చేశామని యజమానులు భవనంలో పెండింగ్ పనులు ఏం లేకుండా చూసుకోవాలని సూచించారు. వంట చేస్తున్న సిబ్బందితో మాట్లాడి అన్నం కూరలను పరిశీలించారు. ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. ఆహార నాణ్యత లో లోటు ఉంటే చర్యలు తప్పవని మంత్రి అధికారులను హెచ్చరించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలా ఉందని, ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో డీఎంహెచ్ వో , డీఆర్డీవో, డీపీఓ, స్థానిక పంచాయతీ సెక్రటరీ లతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రతి 15 రోజులకు ఒకసారి విజిట్ చేయాలని ఆదేశించారు. గురుకుల బాట పేరుతో రాజకీయం.. గురుకుల పాఠశాలల్లో సమస్యలు సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ తన కుట్రలో భాగంగానే గురుకుల బాట పేరుతో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో గురుకుల బాట చేస్తామని బీఆర్ఎస్ చెబుతుందని.. ఏ ముఖం పెట్టుకుని ఆర్ఎస్పీ గురుకులాలకు వెళతారని కవ్వంపల్లి ప్రశ్నించారు. గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్పీ ఎనిమిదేండ్ల కాలంలోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయన్న సంగతి మరువరాదన్నారు. గురుకులాలకు సొంత భవనాలు కట్టకుండా, తన అనుయాయుల భవనాలను తీసుకున్నాడని, పెద్ద ఎత్తున గురుకులాల్లో ఆర్ఎస్పీ అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయన్నారు. ఆర్ఎస్పీ గత ప్రభుత్వ కాలంలో ఏనాడు కూడా డైట్ చార్జీలు పెంచాలని అడుగలేదని, గురుకుల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ఆర్ఎస్పీ చెలరేగిపోయాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల డైట్ చార్జీలను పెంచి, ఒక్కో సమస్యను పరిష్కరించే క్రమంలో గురుకులాల బాట పేరుతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. అంతా ఆర్‌ఎస్పీ కనుసన్నల్లోనే: బండ్రుగురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకురాలు బండ్రు శోభారాణి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నలలోనే హాస్టళ్లలో కుట్రలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్పీ తన స్వేరో నెట్ వర్క్‌తో గురుకులాల్లో సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని కోరారు. లేకుంటే అమాయక విద్యార్థులు వారి కుట్రలకు బలయ్యే ప్రమాదముందన్నారు. ఇకపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు..పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. విద్యా సంస్థల్లో స్కూల్ హెడ్ మాస్టర్, గురుకుల్లాలో వార్డెన్‌తో పాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రతిరోజూ వంట చేయడానికి ముందు స్టోర్ రూం, కిచెన్‌ను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలని పేర్కొంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే.. ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపించాలని ప్రభుత్వం నియమనిబంధలను పెట్టింది. రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి వివిధ విద్యా సంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇటీవలే ఓ విద్యార్థి కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఆహార పదార్థాలకు సంబంధించి.. నాణ్యమైన, పౌష్టికమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని తెలిపింది. 2011 నుంచి ఈ కమిటీలు ఉన్నాయి.. మరోవైపు విద్యాశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు సందర్శించి.. అక్కడ మధ్యాహ్నం భోజనం వడ్డించే తీరు, మిగతా అంశాలను పరిశీలించారు. అనంతరం.. నివేదికలను ప్రభుత్వానికి పంపించనున్నారు. #rs-praveen #brs #minister-sitakka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి