CM Jagan: పెన్షన్ రూ.5000లకు పెంపు!
ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది.
ఏపీ రాజధానిలో భూమి లేని నిరుపేదలను పెన్షన్ పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2500గా ఉన్న పెన్షన్‌ను రూ.5000లకు పెంచుతూ జీవో విడుదల చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ చేయనుంది.
వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది.
టీడీపీ - జనసేన కూటమితో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని టీడీపీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణలు అన్నారు. 'ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ - జనసేన పాలన కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ ను ఇంటికి పంపిస్తారు' అని చెప్పారు.
45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారని.. పెద్దగా మార్పులు ఉండవన్నారు.
జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టొచ్చని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, గ్లాజు గ్లాస్ గుర్తుపై స్వతంత్రులు పోటీ చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే టీడీపీ పార్టీకి నష్టం కలిగే ఛాన్స్ కనిపిస్తోంది.
లారీ మరమ్మతులకు గురి కావడంతో రోడ్డు పక్కన నిలిపి బాగు చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తుల మీదకు విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకువచ్చింది. అంతేకాకుండా అదే సమయంలో అటు గా వెళ్తున్న మరో వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్ నుంచి వర్చువల్ గా వైద్య విజ్ఞాన సంస్థాన్ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు.