AP: టికెట్ రాలేదని పురుగుల మందు తగిన టీడీపీ నేత
నరసరావుపేట అసెంబ్లీ సీటు చదలవాడ అరవిందబాబుకు కేటాయించలేదని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు టీడీపీ సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి. ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
నరసరావుపేట అసెంబ్లీ సీటు చదలవాడ అరవిందబాబుకు కేటాయించలేదని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు టీడీపీ సీనియర్ నాయకులు పులిమి రామిరెడ్డి. ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రజాగళం ప్రజలకు ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిందో అందరికీ తెలుసన్నారు. ముగ్గురు కలసి పోటీ చేసినా సీఎం జగన్ ను ఓడించలేరని వ్యాఖ్యానించారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ అనుచరులు. కదిరి టికెట్ ఆయనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లోని బాబు నివాసం ఎదుట ఆలూరు టికెట్‌ను సుజాతమ్మకు ఇవ్వాలని కార్యకర్తలు నిరసనకు దిగారు.
సోమవారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాధా నాదెండ్లను కలిశారు. ఇద్దరు ముందు నుంచి మంచి మిత్రులు కావడంతో సాధారణ విషయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల క్రమంలో ప్రధానంగా వారిద్దరి మధ్య ఆ చర్చ నడిచినట్లు తెలుస్తుంది.
రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఫైనల్ చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 సీట్లలో పోటీ చేస్తుండగా.. పది మంది పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరో 7 స్థానాలపై కసరత్తు సాగుతోంది.
ఎండలు , ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని , ఏపీలోని ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీ సీఈఓ ఎంకే మీనాతో ఎన్డీఏ కూటమి నేతలు భేటీ అయ్యారు. ప్రధాని పాల్గొన్న ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యంపై సీఈఓకు ఎన్డీఏ ఫిర్యాదు చేసింది. ఎన్నికల విధుల నుంచి డీఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు రేంజ్ ఐజీ, పల్నాడు ఎస్పీలను విధుల నుంచి తొలగించాలని పేర్కొన్నారు.
ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చేదు అనుభవం అయింది. మోడి సభను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా ఆయన మైక్ మూడు సార్లు కట్ అయింది. దాదాపు ఎనిమిది నిమిషాల వరకు మైక్ పనిచేయలేదు. మైక్ కట్ అవ్వడంపై మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు చంద్రబాబు.మోడీ వ్యక్తి కాదు.. ప్రపంచవేదికపై భారత్‌ను తిరుగులేని దేశంగా నిలిపిన శక్తి అని సంబోధించారు. మోడీ అంటే 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిన వ్యక్తి అని కొనియాడారు.