/rtv/media/media_files/2025/04/10/Lo99GYVdk1srP5xXXm1M.jpeg)
gorantla mdhav arrest
మాజీ ఎంపీ, వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కిరణ్ చేబ్రోలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్‌కు తరలించారు. ఎస్పీ ఆఫీస్‌లోనే గోరంట్ల మాధవ్ నానా హంగామా చేశారు. కోపంతో కిరణ్‌పై చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల ముందే కిరణ్‌ను కొట్టాలని చూశాడు. గుంటూరు ఎస్పీ ఆఫీస్‌లో వైసీపీ లీడర్ గోరంట్ల మాధవ్ అనుచరులతో కిరణ్‌పై దాడికి యత్నించాడు. గోరంట్ల మాధవ్ ఎస్కార్ట్ వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
గోరంట్ల మాధవ్... ఒక లోఫర్ ..పోలీస్ దుస్తుల్లో ఉండి రౌడీ లా ప్రవర్తించిన వాడు ఖద్దరు దుస్తులు వేసుకోని అదే రౌడీయిజం చేయాలని చూస్తున్నాడు.
— 🐎🔱సుజత్🕉️☪️✝️ (@KadiroduOffl) April 10, 2025
చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడిన గోరంట్ల మాధవ్..
అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/g6EUt83305
కిరణ్ పై మొత్తం 4 కేసులు పెట్టామని ఎస్పీ సతీష్ తెలిపారు. కిరణ్ గతంలో మాజీ మంత్రి విడదల రజినిపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఎస్సీ చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసి ఇబ్రహింపట్నం దగ్గర అతన్ని అరెస్ట్ చేశామని జిల్లా పోలీస్ అధికారి తెలిపారు.