వైకాపా నాయకుడు తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని గుంటూరుకు చెందిన ఓ గృహిణి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగ్న వీడియోలు, ఫొటోలు అతడి దగ్గర ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి, భయపెట్టి దాదాపు రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏఎస్పీ సుప్రజ స్పందించి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు.
Also Read: హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్.. పదోతరగతి ఉంటే చాలు!
రెండేళ్లుగా అత్యాచారం
ఈ మేరకు భాదిత గృహిణి విలేకరులకు పూర్తి వివరాలు వెల్లడించింది. గుంటూరులోని నల్లపాడులో తను, తన భర్త ఓ వ్యాపారం చేస్తున్నామని.. అయితే ఓ రోజు వెంగళాయపాలేనికి చెందిన వైకాపా నాయకుడు దేవరకొండ నాగేశ్వరరావు పలుమార్లు తమ షాప్‌కి వచ్చాడని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ షాపులో దొంగతనం జరగిందని పేర్కొంది. దీంతో ఓ రోజు తన భర్త లేని సమయంలో అతడు తన వద్దకు వచ్చి తాను వైసీపీ నాయకుడినని.. తనకు చాలా మంది తెలుసని చెప్పినట్లు తెలిపింది.
Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్
దొంగతనం ఎవరు చేశారో పట్టుకుంటానని చెప్పి తన నెంబర్‌ను తీసుకున్నాడని చెప్పింది. అలా తనతో పరిచయం పెంచుకుని ఓ రోజు ఎవరూ లేని సమయంలో షాపులోపలకు వచ్చి అత్యాచారం చేశాడని.. ఆ సమయంలోనే తనకు తెలియకుండా, వీడియోలు, ఫొటోలు తీశాడని పేర్కొంది. వాటిని అడ్డుపెట్టుకుని తరచూ బెదిరించి రెండేళ్లుగా అత్యాచారం చేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
ఓ రోజు డబ్బులు ఇవ్వలేదని తన కాళు, చేతులు కట్టి చిత్రహింసలు పెట్టాడని తెలిపింది. ఆ గాయాలు చూసి తన భర్త ప్రశ్నించగా మొత్తం జరిగిన విషయాన్ని చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశామని పేర్కొంది. అది మనసులో పెట్టుకుని అతడు తన భర్తపై పలుమార్లు హత్యాయాత్నానికి పాల్పడ్డాడని తెలిపింది. తన భర్తతో పాటు తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది.
Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..