అయ్యప్ప సొసైటీలో టెన్షన్ టెన్షన్..! | Hydra Demolishes Illegal Construction In Ayyappa Society | RTV
AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ప్రభుత్వ భూములు అక్రమించారంటూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు.
TG: హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు చెబుతూ బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు.
హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది.