ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కంపెనీలు రాష్ట్రంలో పట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికి చాలా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కంపెనీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో పటిష్టమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. గూగుల్ గ్లోబల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఏపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
Also Read: ఆ ఏడాదికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్
ఎంఓయుపై సంతకాలు చేసిన అధికారులు
ఈ మేరకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్, ఏపి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎంఓయు సందర్భంగా అమరావతి విచ్చేసిన గూగుల్ ప్రతినిధి బృందానికి గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నాయకత్వం వహించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్టిమెంట్స్ కార్యదర్శి యువరాజ్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు పటిష్టమైన ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. తన యుఎస్ఎ పర్యటనలో గూగుల్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలవంతం కావడంపై ఆనందం వ్యక్తంచేశారు.
Also Read: ఇకనైనా ఆ పని మానుకోండి.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలలకే ఆర్సెలర్స్ మిట్టల్/నిప్పన్ స్టీల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్ తో సహా పలు భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (GGNI) వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే నేతృత్వంలోని ప్రతినిధి బృందం విశాఖపట్నం కోసం ప్రతిపాదించిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించింది.
Also Read : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!
ఈనెల 5న గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివిధ ఎఐ ఇనిషియేటివ్‌లలో సహకరించడానికి ఎంఓయూపై సంతకం చేశామని, మలివిడతగా తమ బృందం భారతదేశంలో గూగుల్ కార్యకలాపాలు, దాని భవిష్యత్తు ప్రణాళికలపై ఒప్పందానికి ఎపికి వచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తమకు కీలక భాగస్వామ్య రాష్ట్రమని బికాష్ కోలే అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పెద్దఎత్తున ఐటి పెట్టుబడుల ఆకర్షించడం ద్వారా గణనీయమైన ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధించారని, అదేవిధంగా ఇప్పుడు ఎపిలో ఐటి పరిశ్రమ అభివృద్ధి సాధించగలదన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.