/rtv/media/media_files/2025/11/02/jogi-ramesh-arrested-in-fake-liquor-case-2025-11-02-08-34-26.jpg)
YCP మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో సిట్ అధికారుల తనిఖీలు పూర్తయ్యాయి. జోగి రమేశ్, ఆయన భార్య ఫోన్లను అధికారులు ఈరోజు ఉదయం సీజ్ చేశారు. ఆయన నివాసంలో సీసీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ను ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.
♦నకిలీ మద్యం తయారీ కేసులో YSRCP నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టయ్యారు.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 2, 2025
♦ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది.
♦అనంతరం జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. pic.twitter.com/F3Gglo0JEM
జోగి రమేశ్ బలవంతం చేయడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేశ్ హామీ ఇచ్చారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్‌రావు చెప్పాడు. జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అధికారులు అరెస్టు చేశారు.
Follow Us