Pawan Kalyan Security: పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర.. సెక్యూరిటీలో నకిలీ ఐపీఎస్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్ ఈ ఉదాంతానికి పాల్పడ్డాడు.

New Update

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఒక అంశం తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబర్ 20న పవన్ కళ్యాణ్ మన్యం పార్వతీపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్ చల్ చేయడం సంచలనంగా మారింది. 

Also Read :  ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు!

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌

విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్య ప్రకాష్.. పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్‌గా చాలా హడావిడి చేశాడు. చాలా మంది కింది స్థాయి పోలీస్ అధికారులు సైతం అతడితో ఫొటోలు దిగారు. సూర్య ప్రకాష్‌ నిజంగానే ఐపీఎస్ అధికారి అనుకుని అతడితో ఫొటోలు, వీడియోలు దిగారు. ఇప్పుడిదే అంశం చర్చనీయాంశంగా మారింది. 

ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...

బాగోతం బట్టబయలు

ఈ తరుణంలోనే తాను ఐపీఎస్ నంటూ చెప్పుకుని తిరుగుతున్న సూర్య ప్రకాష్ బాగోతం బయటపడింది. గతంలో తాను ఇండియన్ ఆర్మీలో పని చేశానని సూర్యప్రకాష్ చెప్పుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. అలాగే విజయనగరం జిల్లాలో గతంలో తాను ఉన్నతాధికారిగా హల్ చల్ చేసి వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. 

Also Read :  ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!

ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో ఫొటోలు, వీడియోలు దిగాడని.. ఆ ఫొటోలు తన స్నేహితులకు పంపించి తాను ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాగే విజయనగరం జిల్లా చీపురుపల్లి డీఎస్పీని కూడా కలిసినట్లు సమాచారం. ఆయనతో తాను ట్రైనీ ఐపీఎస్ అధికారి అని పరిచయం చేసుకున్నట్లు తెలిసింది. 

Also Read : అల్లు అర్జున్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో!

పోలీసులకు అనుమానం రాకుండా

మొత్తంగా పోలీసులకు ఎక్కడా అనుమానం రాకుండా చూసుకున్నాడు. డ్రెస్ కోడ్, నడవడిక, మాటతీరు ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. సూర్య ప్రకాష్ ఉదాంతం బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్పందించిన హోం మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. 

ఆ సూర్య ప్రకాష్ ఎవరు?, నకిలీ ఐపీఎస్‌ పేరుతో పవన్ సెక్యూరిటీగా ఎందుకు చేరాడు?, దీని వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందా?, పవన్ కళ్యాణ్‌ను ఏం చేద్దామని ఈ చర్యకు పాల్పడ్డాడు? వెనకుండి ఎవరైనా నడిపిస్తున్నారా? అసలు ఇంతటి తెగింపుకు గల కారణాలేంటి? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు