/rtv/media/media_files/2025/06/30/polavaram-banakacharla-project-2025-06-30-20-04-40.jpg)
Polavaram-Banakacharla project
BIG BREAKING : ఏపీకి కేంద్రం ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు నిపుణుల కమిటీ షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించింది. బనకచర్లపై ఏపీ ప్రతిపాదనను కేంద్రం తిప్పి పంపింది.ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని ఈ దశలో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని కమిటీ తెలిపింది.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యున్ (జీడబ్ల్యూడీటీ) అవార్డును పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులకు సీడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఆ తర్వాతే అనుమతులపై పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు పాలు తాగుతున్నారా..? దాని దుష్ప్రభావాలు ఇవే