/rtv/media/media_files/2025/08/08/pulivendula-zptc-elections-2025-08-08-18-24-16.jpg)
Pulivendula ZPTC By Elections
Pulivendula ZPTC By Elections : పులివెందుల జడ్‌పీటీసీ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. గడచిన మూడు దశాబ్ధాలుగా ఇక్కడ ఎన్నిక జరగకపోవడం, తొలిసారి ఎన్నికలు జరగనుండటంతో పులివెందుల నేడు హాట్ టాఫిక్‌గా మారింది. పులివెందుల అనగానే వైఎస్ ఫ్యామిలీ అడ్డా అనేది అందరికీ తెలిసిందే. దీంతో ఇక్కడ వారు ఎంత చెబితే అంతా అన్నట్లు జరుగుతుంది. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవమే అయ్యాయి. 1995, 2001, 2006, 2021 ఇలా అన్ని ఎన్నికలు ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ అభ్యర్థిగా రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ విత్‌డ్రా సమయంలో వైసీపీలో చేరడంతో ఎన్నిక నామమాత్రం అయింది. నాడు వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్ల గాను 2,500 ఓట్ల మెజార్టీతో జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ సమయంలో అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ 2750 ఓట్లు సాధించింది. అంతకు ముందు1995, 2001, 2006 సంవత్సరాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తు్న్నారు.
గత2021లో వైసీపీ అభ్యర్థి మహేశ్వరరెడ్డి సైతం ఏకగ్రీవంగా జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.. అయితే మహేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. జగన్ కంచుకోటను ఎలాగైన దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ పావులు కదుపుతుంది. ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా మారాయి.. తమ సొంత గడ్డపై తిరిగి జెండా పాతాలని వైసీపీ భావిస్తుంటే, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగదేశం భావిస్తుంది. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం పులివెందుల జడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లు ఉన్నాయి… అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల జడ్పీటీసీ పరిధిలో టీడీపీకి 25 శాతం ఓటు బ్యాంకు నమోదైంది. 25 శాతం ఓటు బ్యాంకు ప్రకారం అంటే దాదాపు 2600 ఓట్లు మాత్రమే టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి.. 2016 జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి.. అంటే ఎటు చూసినా పులివెందులలో టీడీపీకి పెద్దగా బలం లేదు. కానీ, అధికారం చేపట్టాక ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని తెలుగుదేశం నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు..
ఇక ఉప ఎన్నికల్లో మాజీ జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డిని వైసీపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. చనిపోయిన వైసీపీ నేత కుటుంబానికి అండగా ఉన్నాం అన్న భరోసా కల్పిస్తూ ఈ టికెట్ వారి కుటుంబ సభ్యులకు కేటాయించినట్లు వైసీపీ చెబుతోంది. టీడీపీ పాలసీ ప్రకారం చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటే పోటీ పెట్టదు. కానీ, జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని నిలిపింది. అయితే ఈ ఎన్నికల్లో పులివెందుల మండలానికి చెందిన వ్యక్తులు కాకుండా సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది… వైసీపీ సిట్టింగ్ జడ్‌పీటీసీ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.. తగ్గేదేలే అంటూ వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలాగైనా సరే పులివెందుల జడ్పిటీసీ స్థానాన్ని దక్కించుకొని ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైపీపీ భావిస్తోంది. జగన్ అడ్డాలో వైసీపీ అధినేతకు షాక్ ఇస్తుందా..? లేక ఓటమిని చవిచూస్తుందా..? అనేది ఈ నెల 14న తేలనుంది.
ఇది కూడా చూడండి:Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్