Pulivendula ZPTC By Elections : నివురు గప్పిన నిప్పులా పులివెందుల..అడుగడుగున పోలీసుల తనిఖీలు
వైఎస్సార్ కడప జిల్లాలో గత కొద్ది రోజులుగా రాజకీయ ఉద్రిక్తత నెలకొన్నది. జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం వేడెక్కింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.