/rtv/media/media_files/2025/02/04/DCbdtNAzJ2EqjYIbZTVo.webp)
Deputy Mayor of Tirupati
Municipal Corporation : రెండు రోజులుగా ఉత్కంఠ రేపిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని ఎట్టకేలకు టీడీపీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యారు. కాగా తిరుపతిలో కార్పొరేటర్లను తమవైపునకు తిప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. దీంతో టీడీపీకి అనుకూలంగా 26.. వైఎస్సార్‌సీపీకి 21 ఓట్లు పోలయ్యాయి. గత రెండు రోజులుగా కిడ్నాప్‌లు, ఆరోపణలు ఆందోళనలు, వాహనాల ధ్వంసంతో తిరుపతి రణరంగంగా మారింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు.
Also Raed: Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!
కాగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎంతో ఉత్కంఠభరితంగా జరిగింది. సోమవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. అలాగే మంగళవారం కూడా ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.వైసీపీ, టీడీపీకి చెందిన కార్పొరేటర్లు సకాలంలో సమావేశానికి హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. చివరికి కూటమి అభ్యర్థి గెలుపుతో ఉత్కంఠకు తెరపడింది. 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ ఆఫిషియో నెంబర్లు.. మొత్తం 50 మంది ఉన్న కార్పొరేషన్‌లో ఓటింగ్‌లో 48 మంది పాల్గొన్నారు. ఇద్దరు అనారోగ్యంతో రాలేకపోయారు. దీంతో ఓటింగ్ నిర్వహంచిన ఎన్నికల అధికారి ముందు వైఎస్సార్‌సీపీ వాళ్లు చేతులెత్తాలని కోరగా 21 మంది చేతులెత్తారు. తర్వాత కూటమి నేతలు 26 మంది చేతులెత్తారు. దీంతో కూటమి అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
కాగా డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం జరగాల్సి ఉంది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఆదివారం రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామాకొనసాగింది. ఆదివారం రాత్రి టీడీపీ శిబిరంలో ఉన్న వైసీపీ కార్పొరేట్లను తమ వెంట తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. చివరికి అనుకున్నది సాధించారు. అయితే ఎన్నిక నిర్వహించాలంటేకోరం 25 మంది ఉండాలి. అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల మేరకు ఎన్నికను మంగళవారం నాటికి వాయిదా వేశారు. దీంతో ఈరోజు గట్టి బందోబస్తు మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు.
Also Read: Watch Video: మాతృభాషలో రాసేందుకు తిప్పలు పడ్డ రాష్ట్ర మంత్రి.. వీడియో వైరల్