Andhra Pradesh : పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేతల నుంచి లేఖలు అందుతున్నాయి. ముందు హరిరామ జోగయ్య లేఖ రాయగా.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ ను ఉద్దేశించి..మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి..అంటూ ఎద్దేవా చేస్తూ పవన్ కు లేఖ రాశారు.
వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేశ్ కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు.
ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై గొల్లపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకునేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు.
ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు.