Crime News : గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. మరోకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు.