పిఠాపురంలో కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్ర: వర్మ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో అలర్లు సృష్టించి కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్రలు చేస్తోందని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ సంచలన ఆరోపణలు చేశారు. రౌడీ షీటర్లు, పోలీస్ కేసులు ఉన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నియమిస్తోందన్నారు.

New Update
పిఠాపురంలో కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్ర: వర్మ సంచలన వ్యాఖ్యలు

పిఠాపురం నియోజవర్గం ఎలక్షన్ కౌంటింగ్ హాల్ దగ్గర అల్లర్లు సృష్టించి కౌంటింగ్ ఆపలన్న దురుద్దేశంతో వైసీపీ అధినేత జగన్ ఉన్నారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి SVSN వర్మ ఆరోపించారు. వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ షీటర్లను, పోలీస్ కేసులు ఉన్న వారిని నియమించిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థం అవుతోందన్నారు. కౌంటింగ్ ఆపాలని వైసీపీ కుట్ర చేస్తుందన్నారు.

కౌంటింగ్ ఏజెంట్లపై కేసులు ఉన్నాయా? అన్న విషయాన్ని తనిఖీ చేయాలని ఆర్వోలను కోరారు. ఇండిపెండెంట్ దగ్గర కూడా పాస్ లను తీసుకుని వారి తరఫున వైసీపీ తమ మనుషులను కౌంటింగ్ ఏజెంట్లుగా పంపిస్తోందన్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ పోటీలో ఉన్న కారణంగా ఆయనను దెబ్బ తీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. వైసీపీ కుట్రలను చట్ట ప్రకారం ఎదుర్కొంటామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు