Gannavaram : ఉపాది కూలీలపై తేనేటీగల దాడి.. 50 మందికి పైగా గాయాలు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా బూరుగుగుంటలో ఉపాది కూలీలపై పైతేనేటీగలు దాడి చేశాయి. 50 మందికి పైగా దాడికి గురవగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్ లో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణ నష్టం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.