Srisailam: శ్రీశైలం ఆలయంలో డ్రోన్‌ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు

శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం రేపింది. దేవస్థానం అనుమతి లేకుండా ఆలయ పరిధిలో డ్రోన్ చక్కర్లు కొట్టింది. వెంటనే ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Srisailam : శ్రీశైలంలో రూ.19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం..ధర్మకర్తల మండలి నిర్ణయం.!
New Update

Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆలయానికి సమీపంలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి అలర్ట్‌ అయ్యారు. వెంటనే డ్రోన్ ఎగురుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు కనిపించారు. 

Also Read:  UK Diwali Celebrations: ప్రధాని దీపావళి విందులో మద్యం, మాంసం..!

ఆలయ అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఇక్కడ ఎందుకు ఎగరవేస్తున్నారని వారిని అధికారులు ప్రశ్నించారు. శ్రీశైలం ఆలయ పరిధిలో డ్రోన్ కెమెరాలు నిషేధించారని హెచ్చరించారు. వెంటనే డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. ఆ ఇద్దర్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Also Read:  Alert: హైదరాబాద్‌ వాసులు బి అలెర్ట్‌...ఈ ఏరియాల్లో వాటర్‌ బంద్‌!

గతంలో కూడా శ్రీశైలం సమీపంలో డ్రోన్‌లు ఎగురవేసిన ఘటనలు ఉన్నాయి. రాత్రి వేళల్లో వరుసగా డ్రోన్‌లు ఎగురవేశారు.. అయితే వారిని గుర్తించేలోపు వారు పారిపోయారు. మళ్లీ ఇప్పుడు డ్రోన్ కలకలం రేపింది. వీరు శ్రీశైలం వచ్చిన భక్తులని తెలుస్తోంది. ఆలయం సమీపంలో ఇలా డ్రోన్ ఎగురవేయడం కలకలం రేపింది.

Also Read:  TTD: అధికారుల నిర్ణయానికి నో చెప్పిన టీటీడీ  ఛైర్మన్

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్న అఘోరి నాగసాధు శ్రీశైలంలో  కనిపించారు. ఆమె శ్రీశైలం వచ్చారని తెలియడంతో డీఎస్పీ, సీఐ, సీఎస్వోలు ముఖద్వారం దగ్గరకు వెళ్లారు. శ్రీశైలంలో మల్లన్న ఆలయ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకోవాలని సూచించగా అంగీకరించారు. 

Also Read: పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం

మహిళా పోలీసులు, ఆలయ సిబ్బంది అఘోరికి దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయంలో అఘోరిని భక్తులు ఆసక్తిగా చూడగా.. కొందరు ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించారు.ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని అన్నారు అఘోరి. 

తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న తనను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనను ఆలయాలను సందర్శించేందుకు సహకారం అందించాలని కోరారు. శ్రీశైలం నుంచి కోటప్పకొండ, విజయవాడ ఆలయాలు దర్శించుకుని కుంభమేళాకు వెళ్తున్నట్లు చెప్పారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe