Ajith Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు బిగ్ రిలీఫ్..

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు బినామీ ఆస్తుల విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. బినామీ ఆస్తుల ఆరోపణల విషయంలో 2021లో దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే బినామీ ఆస్తులు సంపాదించారని సరైన ఆధారాలు లేకపోవడంతో ఐటీ శాఖ క్లియర్ చేసింది.

New Update
Ajith pawar

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను శాఖ 2021లో అతని బినామీ ఆస్తులను జప్తు చేసింది. దాదాపుగా రూ.1000 కోట్ల ఆస్తులను జప్తు చేయగా.. ఇటీవల వాటిన్నింటిని క్లియర్ చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆదాయపు పన్ను శాఖ ఈ ఆస్తులను క్లియర్ చేసింది. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

బినామీ ఆస్తులు సంపాదించారని..

బినామీ ఆస్తులు ఉన్నాయని ఎన్‌సీపీ నాయకుడు 2021లో అజిత్ పవార్‌పై ఆరోపణలు చేశారు. దీంతో అజిత్ పవార్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్టరీ, ఢిల్లీలో ఉన్న ఓ ఫ్లాట్, గోవాలోని రిస్టార్ట్‌తో పాటు కొన్ని ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులకు సరైన ఆధారాలు లేవని ట్రిబ్యూనల్ అభియోగాలను కూడా మోపింది. అజిత్ పవార్ కానీ అతని కుటుంబ సభ్యులు బినామీ ఆస్తులు సంపాదించారని ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో ఐటీ శాఖ ఆస్తులను క్లియర్ చేసింది. 

ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే‌తో పాటు అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు. అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, బిహార్ సీఎం నితీష్‌ కుమార్ సహా పలువురు సీఎంలు, కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. 

ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

ఇది కూడా చూడండి:  ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు