/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-31-55.jpeg)
Madvi Hidma
Madvi Hidma: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.-- లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్‌కౌంటర్ అయ్యారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నారు. ఈలోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా హతమయ్యారు. అయితే తాజాగా పదిరోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. త్వరలో తనను ఏపీలో కలవాలని జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం.
Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి
ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకున్నట్లు జర్నలిస్టుకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరేండర్ అయ్యేందుకు సిద్ధం అన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది. లొంగుబాటుకు సంబంధించి ఎక్కడ..? ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు.-- ఈనెల 10న బస్తర్ జర్నలిస్ట్‌కు తన నిర్ణయాలపై లేఖ రాసిన హిడ్మా రాసిన లేఖ వైరల్‌గా మారింది.
Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..
ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకున్నట్లు జర్నలిస్టుకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరేండర్ అయ్యేందుకు సిద్ధం అన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది. లొంగుబాటుకు సంబంధించి ఎక్కడ..? ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు. అయితే అందరూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరని సైతం ఆ లేఖలో పేర్కొన్నారు.తన ఆలోచనలతోపాటు నిర్ణయాలపై వీడియో రిలీజ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలేఖరికి రాశారు. నాలుగైదు రోజుల్లో హిందీతో పాటు తెలుగులోనూ ఒక ఆడియో స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు కూడా ఆ లేఖలో ఉంది. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాల్సి ఉందని లేఖలో సుధీర్ఘంగా హిడ్మా రాసినట్లు తెలుస్తోంది.
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
అంతలోనే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య, అనుచరులు మృతి చెందటం కలకలం రేపింది.-- లొంగిపోయేందుకు వచ్చిన సమయంలోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా, రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో హెడ్మాతోపాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం కోసం కాకినాడ వైజాగ్ నుండి ఫోరెన్సిక్ బృందం రంపచోడవడానికి రానుంది.ఇప్పటికే హిడ్మా మరణ వార్తను ఛత్తీస్‌ఘడ్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పోలీసులు చేరవేర్చారు. వారందరూ రంపచోడవరానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు హిడ్మా మృతదేహాన్ని అప్పగించనున్నారు.
Also Read: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి.. మల్లోజుల తాజా వీడియో రిలీజ్
మారేడుమిల్లి ఎన్ కౌంటర్‍లో నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కీలక వీడియో రిలీజ్ చేశారు. ఆపరేషన్ కగార్ కారణంగా గత కొంత కాలంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అయన అభిప్రాయపడ్డారు. ఎన్ కౌంటర్ల వల్ల ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. తాజాగా హిడ్మా సైతం ఎన్ కౌంటర్ అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వీడియో సందేశం పంపించారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మావోయిస్టులు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోవాలని అనుకునే మావోయిస్టులు తన ఫోన్ నంబర్ 8856038533 ను సప్రదించాలని సూచించారు.
Follow Us