వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ గతంలో శ్రీనివాస్ భార్య వాణి ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీరి వివాదం సంచలనం సృష్టించింది. అయితే ప్రస్తుతానికి వీరు స్నేహితులు అని త్వరలో భార్యాభార్తలుగా మారనున్నామని కూడా వీరు పలు సందర్భాల్లో చెప్పారు. ఇది కూడా చూడండి: 8 మంది ఉన్నా.. బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఉగ్రరూపం! ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. ఇదంతా పక్కన పెడితే నేడు దివ్వెల మాధురి పుట్టిన రోజు. ఈమె పుట్టిన రోజు వేడుకలను దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఘనంగా నిర్వహంచారు. దీంతో RTV రిపోర్టర్ ఆమెతో మాట్లాడారు. శ్రీనివాస్ ఇలా పుట్టిన రోజు వేడుకలు జరపడంతో ఎలా ఉందని రిపోర్టర్ అడగడంతో ఆమె స్పందిస్తూ.. మొదటిసారి ఇలా పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపడంతో ఆనందానికి అవధుల్లేవని మాధురి అన్నారు. ఇది కూడా చూడండి: US: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్! ఇలా నియోజకవర్గం ప్రజలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తన లైఫ్‌లో ఇదో బెస్ట్ మెమోరీ అని మాధురి తెలిపారు. అయితే పుట్టిన రోజు సందర్భంగా శ్రీనివాస్ మీకు స్పెషల్ గిఫ్ట్ ఏం ఇచ్చాని రిపోర్టర్ అడగ్గా.. వెలకట్టలేని గిఫ్ట్ తన మనస్సును నాకు ఇచ్చారని మాధురి తెలిపారు. కోర్టు కేసులు అన్ని క్లియర్ అయ్యాక భార్యాభర్తలుగా మారుతామని, ప్రస్తుతానికి మానసికంగా భార్యాభర్తలే అని ఆమె తెలిపారు. ఇది కూడా చూడండి: BIT Coin: 24 గంటల్లో 3.82 లక్షల ప్రాఫిట్ ఇదిలా ఉండగా నవంబర్ 4న దువ్వాడ శ్రీనివాస్ పుట్టిన రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా దివ్వెల మాధురి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వాచ్ ఖరీదు సుమారుగా రూ.2 లక్షలు ఉంటుందట. ఇది కూడా చూడండి: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!