జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నడక మార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన..తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బుధవారం తిరుమలలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందనే విషయంలో ఆయన ప్రాయశ్చిత దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దానిని ఆయన నిన్న విరమించారు.
తీవ్రమైన జ్వరం...
ఆ తరువాత అక్కడే ఆయన అతిథి గృహంలో బస చేశారు. అయితే పవన్ ప్రస్తుతం తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో.. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. గత రెండు రోజులుగా పవన్ అసౌకర్యంగానే ఉంటున్నారు. కానీ, తనకు అనారోగ్యంగా వున్నా.. ఈరోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా జనసేన శ్రేణులు వెల్లడించాయి.
ఇక, తిరుపతి వేదికగా జరిగే వారాహి బహిరంగ సభలో.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ వ్యవస్థ కోసం పవన్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం వరకు అక్కడే ఉంటారని సమాచారం. సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొననున్నారు.
Also Read: ప్లీజ్ ఇక ఈ విషయాన్ని వదిలేయండి..టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి!