Nagarjuna: ప్లీజ్ ఇక ఈ విషయాన్ని వదిలేయండి..టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి! కొండా సురేఖ మీద టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా స్పందిస్తుంది. దీంతో ఈ విషయాన్ని ముగించాలని రంగంలోకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టాలని , భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆయన సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు. By Bhavana 03 Oct 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేస్తున్న క్రమంలో నటి సమంత, నాగచైతన్య, నాగార్జున విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, నాని, కోన వెంకట్, ఆర్జీవీ , వెంకటేష్, అల్లు అర్జున్ వంటి వారు ఈ విషయం గురించి తీవ్రంగా స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ దీనికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ఈ విషయం గురించి రంగంలోకి దిగారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు ఓ కీలక విజ్ఞప్తి ని చేశారు. ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారాయన. Also Read: నస్రల్లా అల్లుడు కూడా మృతి! దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌కు ఫుల్స్టాప్ పెట్టేశారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్. భవిష్యత్‌లో సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. మహిళా మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్‌మీడియాలో ట్రోల్స్ అందరూ చూశారని వివరించారు. Also Read: కొండా సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయి: చిరంజీవి! ఆ బాధతో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా సమాజానికి మంచిది కాదన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ఆయన అన్నారు. Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్ లోనే.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి