/rtv/media/media_files/ot8kMboXt8zlgnChyhUd.jpg)
CM Chandrababu: బూడిద చిచ్చు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో ముగ్గురు నేతలకు సీఎం కార్యాలయానికి రావాలంటూ వారికి కబురు అందింది. జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి పిలుపు వచ్చింది. RTPP బూడిద తరలింపు విషయంలో జేసీ, ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ!
జేసీ Vs ఆది నారాయణ...
RTPP బూడిద తరలింపు రవాణాలో వాటా కోసం ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టు పడుతున్నారు. వాటా ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో జేసీ వాహనాలకు బూడిద నింపకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఆదినారాయణ రెడ్డి బూడిద లారీలను తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి, జమ్మలమడుగులో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుగమంచిపల్లి వద్ద పోలీస్ చెక్ పోస్టు.. కొండాపురం తాళ్లపొద్దుటూరు పరిధిలో 144సెక్షన్ అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు నేతలకు చంద్రబాబు పిలుపు అందించారు.
ఇది కూడా చదవండి: BREAKING: వైసీపీ మాజీ మంత్రి పీఏ అరెస్ట్!
ఇది కూడా చదవండి: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం!
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!