Free Gas Cylinders: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా లబ్ధిదారులకు మరో కీలక ప్రకటన చేశారు. మహిళలు తొలుత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సిలిండర్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం లబ్దిదారులు డబ్బులు చెల్లిస్తే రెండు రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల డైరెక్ట్ గా ఉచిత సిలిండర్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. త్వరలోనే వాటిని పరిష్కరించి ఉచిత సిలిండర్ అందేలా చేస్తామని చెప్పారు. కాగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి...
కాగా మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోగా బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 48 గంటల్లోగా ఇంటికి గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి జులై 31 లోగా రెండో సిలిండర్ బుక చేసుకునేలా అవకాశం కల్పించినట్లు చెప్పారు.
డిసెంబర్ 1 నుండి మార్చి 31 లోగా 3 వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఏడాదికి దాదాపు రూ.2,684.75 కోట్లు ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం అని అన్నారు.
Also Read: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!
Also Read: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు