ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే చెత్త పన్ను రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

AP cabinet
New Update

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతీ నాలుగు నెలలకొకటి చొప్పున ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ దీపం పథకం కింద ఈ మూడు సిలిండర్‌లు ఇవ్వనుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.  అలాగే చెత్త పన్ను రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.  

Also Read: చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా?

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు రూ.3500 కోట్ల చెల్లింపుపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇక దేవాలయాల్లోని పాలకమండలి సభ్యుల సంఖ్యను కూడా 15 నుంచి 17కు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పాలకమండలిలో కనీసం ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా తీసుకోనున్నారు.

Also Read: రేపు మధ్యాహ్నం 12 గంటలకు షాకింగ్ నిజాలు.. వైసీపీ సంచలన ట్వీట్!

ఉచిత ఇసుక విధానంలో కూడా సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీ రద్దు వల్ల ప్రభత్వంపై రూ.264 కోట్ల భారం పడుతుందన అంచనా వేశారు. ఫ్రీ ఇసుక లక్ష్యం నెరవేర్చేవరకు నష్టం భరిద్ధామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. పట్టా భూముల్లో ఎవరిఇసుక వారు తీసుకునేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక విశాఖపట్నంకు చెందిన వివాదాస్పద పీఠాధితి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం అప్పగించిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

 

#pawan-kalyan #jagan #cm-chandrababu #ap-cabinet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe