రాజ్యాంగ దినోత్సవం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు. By B Aravind 26 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనన్నారు. ఆర్థిక సంస్కరణల వల్లే సంపదను సృష్టించగలమని పేర్కొన్నారు. ''భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అనేక దేశాల రాజ్యాంగాలను పరిశోధించి అందులో ఉన్నతమైన వాటిని తీసుకొని బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి రాసిన మహోన్నత గ్రంథం రాజ్యాంగం. Also Read: ఇదేం వింత రూల్ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాంటే రక్తంతో సంతకం చేయాల్సిందే అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయంగా సమతుల్యం తీసుకూరావాలని, అందరికి సమానావకాశాలు తీసుకురావాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. ఎంత మంచి రాజ్యాగం ఉన్నా దాన్ని అమలు చేసేవారు చెడువారైతే చెడుగా మారుతుతుంది. ఎంత చెడు రాజ్యాగమైనా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిగా మారుతుందని అంబేద్కర్ అన్నారు. ఓటు అనేది పవిత్రమైన సైలెంట్ రెవిల్యూషన్. అంబేద్కర్ ఇచ్చిన ఓటు చూస్తే బలవంతులు, బలహీనులు అందరికీ ఓటు వుంది. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా దానిని సరిచేసే శక్తి ఓటుకు ఉంది. ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు వచ్చాయి. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రాథమిక హక్కులను కాలరాసే పరిస్థితులు చూశాం. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమే. దేశంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఉన్నాయి. ఆర్థిక సంస్కరణల వల్ల సంపద సృష్టిస్తాం. Also Read: నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా ? ఇంకా పేదరికం వుంది. పేదరిక నిర్మూలన కోసం ముందుకు వెళ్లాల్సి వుంది. అందరి మనోభావాలు గుర్తు పెట్టుకోవాలి. కులం, మతం, ప్రాతం పేరుతో విడిపోతే ప్రమాదం వస్తుంది. గత ఐదు సంవత్సరాలు మరచిపోదామనుకున్నా. గత ఐదు సంవత్సరాల జీవోలతో పాటు, ఇప్పుడిచ్చే జీవోలను కూడా ఆన్ లైన్ లో పెట్టి ముందుకు పోతున్నాం. చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగంపై పూర్తిగా అవగాహన రావాలని'' చంద్రబాబు నాయుడు అన్నారు. #andhra-pradesh #telugu-news #chandra-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి