పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

AP: ఎన్టీఆర్‌ భరోసా కింద కొత్త పెన్షన్లను జనవరిలో మంజూరు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను అనుసరించి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

New Update
AP Pensions Hike : ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే?

AP Pensions: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని అమలు చేసింది.  అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్ దారులకు పెన్షన్ అందించింది. ప్రతి నెలా ఒకటో తారీఖు వరకు 90 శాతం పెన్షన్ల పంపిణీ జరిగేలా కూటమి సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. కాగా తాజాగా ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను జనవరిలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశాలు ఇచ్చారు

ALSO READ: అంబటి రాంబాబుపై చర్యలు.. టీడీపీ సంచలన ట్వీట్!

ప్రతి ఆరు నెలలకు...

కాగా చంద్రబాబు సర్కార్ ఈ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను అనుసరించి పింఛన్లు మంజూరు చేయాలని మంత్రి కొండపల్లి అధికారులకు సూచించారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా మూడో నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ విధానాన్ని డిసెంబర్ నెల నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.  భర్త చనిపోయినవారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పెన్షన్ అందుతోందని చెప్పారు.

Also Read :  క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR

ప్రజల సంక్షేమమే తమ ఎజెండాగా చంద్రబాబు న్యాయకత్వంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపి క్షేత్రస్థాయిలో మళ్లీ అధికారులకు సమీక్షించనున్నారు. ఇక్కడ అనర్హులుగా నిర్ధారణ అయితే వారికి వస్తున్న పెన్షన్ ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 

Also Read :  అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

Advertisment
తాజా కథనాలు