మందు బాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన రూ.99కే క్వార్టర్‌

మందు బాబులు ఎంతగానో ఎదురు చూసే రూ.99 క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని వైన్ షాప్ లలో రూ.99 క్వార్టర్ ఇకపై లభ్యమవుతుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.

wine shop
New Update

ఏపీలో కొత్త మద్యం పాలసీతో ఆదాయం సమకూరుతోంది. గతంతో చూస్తే ఈ సారి మందు ధరలు తగ్గడంతో మందు బాబులు చెలరేగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతానికి పైగా మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఈ రోజుకి 100 శాతం మద్యం షాపులు తెరచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 లక్షల కేసులు లిక్కర్, బీరు కేసులు సరఫరా కాగా.. దీని ద్వారా మొత్తం రూ.530 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మందు బాబులు ఎంతగానో ఎదురు చూసే రూ.99 క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చూడండి: బాలయ్య కాళ్లు మొక్కిన హోమ్ మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో

ధరలు ప్రకారం మాత్రమే..

ఈ నెల చివరికి ఎక్కువ మొత్తంలో స్టాక్‌ వస్తుందని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం రోజుకు 10 వేల కేసులు సరఫరా చేస్తున్నారని త్వరలో ఈ సప్లైని పెంచుతామని వెల్లడించారు. ప్రస్తుతం రేటు ప్రకారం మాత్రమే అమ్మకాలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. సిండికేట్ల వల్ల ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ రోజు అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయని ఆయన వెల్లడించారు. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ హెచ్చరించారు.

ఇది కూడా చూడండి:  Karimnagar: అర్థరాతి ఎమ్మెల్యేకు నగ్న వీడియో కాల్.. తర్వాత ఏమైందంటే?

ఇదిలా ఉంటే.. ఏపీలో ఈ నెల 16  నుంచి నూతన మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కాగా సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాజినికి దీనికి ప్రధాన కారణం.. ఎన్నికల సమయంలో నాణ్యమైన మధ్యాన్ని తక్కువ ధరకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి సీఎం అయ్యిన చంద్రబాబు మద్యం ధరలు ఎక్కడ తగ్గించలేదని వాపోతున్నారు.

ఇది కూడా చూడండి: పోస్టాఫీసుల ద్వారా డ్రగ్స్‌ రవాణా.. రూ.21.17 కోట్ల సరుకు స్వాధీనం!

జగన్ ప్రభుత్వంలో ఎలాంటి రేట్లు ఉన్నాయో అలాంటి రేట్లు తోనే మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం మమల్ని మోసం చేసిందని  మందు బాబులు ఫైర్ అవుతున్నారు. కాగా కేవలం రూ.99కే నాణ్యమైన క్వార్టర్ అందిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మద్యం రేట్లను తగ్గించి రూ.99కే మద్యాన్ని అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Putin: ఇండియన్‌ సినిమాలంటే మాకు ఎంతో ఆసక్తంటున్న రష్యా అధ్యక్షుడు!

#andhra-pradesh #cm-chandrababu #apliquor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe