Karimnagar: అర్థరాతి ఎమ్మెల్యేకు నగ్న వీడియో కాల్.. తర్వాత ఏమైందంటే?

ఉమ్మడి కరీంనగర్ లో ఓ ఎమ్మెల్యేకి అర్థరాతి వీడియో కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన ఆ కాల్ ను లిఫ్ట్ చేయగా.. ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో ఎమ్మెల్యే ఆందోళన చెంది వెంటనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశాడు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్య క్రేజ్‎ను క్యాష్ చేసుకుంటున్న సైబర్ కేటుగాళ్లు...ఆ లింక్  క్లిక్ చేశారో అంతే సంగతులు..!!

ఈ మధ్య కాలంలో చాలా మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా న్యూడ్ కాల్స్ బెడద అయితే తప్పడం లేదు. సామాన్య మనుషుల నుంచి సెలబ్రిటీల వరకు న్యూడ్ కాల్స్ తో ఇబ్బంది పడుతుంటారు. ఈ న్యూడ్ కాల్స్ బెదిరింపులు బారిన ఓ ఎమ్మెల్యే కూడా పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్థరాత్రి సమయంలో వీడియో కాల్ వచ్చింది.

ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

గుర్తు తెలియని నంబర్ నుంచి..

అది కూడా గుర్తుతెలియని నంబర్‌ నుంచి వచ్చింది. అయిన ఆ వీడియోకాల్‌ను ఎమ్మెల్యే లిఫ్ట్ చేశారు. వెంటనే ఓ మహిళ నగ్నంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే ఆందోళనకు గురై కాల్‌ కట్‌ చేశారు. తనపైన ఏదైనా కుట్ర జరుగుతుందా? ఎవరైనా కావాలనే అలా వీడియోకాల్‌ చేశారా? లేకపోతే నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేశారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు వచ్చింది.

ఇది కూడా చూడండి: Big Breaking: వాలంటీర్లకు బిగ్ షాక్.. కీలక ప్రకటన!

తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారనే కోణంలో ఆ ఎమ్మెల్యే ఆలోచించారు. దీంతో వెంనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్‌ ఎవరిదని పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: మహిళలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ?

ఇదిలా ఉంటే ఇటీవల అహ్మదాబాద్‌ నారన్‌పురాలోని 132 ఫీట్ రింగ్ రోడ్‌లోని సమర్పన్ టవర్‌లో నివసిస్తున్న 27 ఏళ్ల హేమాలి పాండ్య అనే మహిళకు అక్టోబరు 13న ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను కొరియర్ కంపెనీ ఉద్యోగినంటూ తెలిపాడు. ఆపై మూడు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు, 150 గ్రాముల మెఫెడ్రోన్, 1.5 కిలోల క్లాత్‌లు ఆమె పేరుతో ఉన్న పార్శిల్‌ను థాయ్‌లాండ్‌కు పంపినట్లు ఆ వ్యక్తి మాట్లాడాడు. శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చూపించమని అడిగి డబ్బులు అడిగి తీసుకున్నాడు. 

 ఇది కూడా చూడండి: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు