Isaac Basha: వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు!

AP: వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకు షాక్ తగిలింది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసు నమోదైంది. మసీద్ నిధుల అవకతవకలు పాల్పడినట్లు బాధితుడు సలాం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
MLC Isaac Basha

MLC Isaac Basha : వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకు షాక్ తగిలింది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసు నమోదైంది. కోర్టు అదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇషాక్ తో పాటు మరో నలుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మసీద్ నిధుల అవకతవకలు పాల్పడినట్లు, అక్రమ కట్టడంపై  కోర్టును బాదితుడు సలాం ఆశ్రయించగా.. కోర్టు అదేశాలతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  తెలంగాణలో దారుణం.. టీచర్ ప్రాణం తీసిన కోతి

విఫలమైన కూటమి ప్రభుత్వం: బాషా

ఏపీలో మానభంగాలు, అఘాత్యాలు, చిన్నారుల పై దాడులు ఆగడం లేదని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఫైర్ అయ్యారు. కొత్త కొలువుదీరిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా మహిళల, చిన్నారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాత్యాలను, మానభంగాలను ఆపేలా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.

Also Read :  వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ

బాలిక కుటుంబానికి రూ.10లక్షలు!

ఇటీవల నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో  9 సంవత్సరాల బాలిక హత్య జరిగినటివంటి కుటుంబానికి వైసీపీ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా,ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి,  నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి డాక్టర్ సుధీర్, కర్నూల్ జడ్పీ చైర్మన్ పాపి రెడ్డి తదితర వైసీపీ పార్టీ నాయకులు  పాల్గొనడం జరిగింది. బాధిత కుటుంబానికి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి తరుపున 10 లక్షల రూపాయిల చెక్కును అందచేస్తూ, వారికీ ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలిపారు.

Also Read :  నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

Also Read :  131 ఏళ్ళ చరిత్ర తిరగరాసారు...వాట్ ఏ విక్టరీ

Advertisment
Advertisment
తాజా కథనాలు