ఓ కోతి ప్రభుత్వ టీచర్ ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ZPPS చుంచనకోటలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న ధర్మారెడ్డి.. వేచరేణి గ్రామం నుంచి బైక్‌పై ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో సిద్ధిపేటలోని బండపల్లి క్రాసింగ్ వద్ద సడెన్‌గా కోతి అడ్డం వచ్చింది.
దాంతో బైక్ అదుపుతప్పడంతో ధర్మారెడ్డి పెట్టుకున్ హెల్మెట్ ఎగిరి పక్కకు పడిపోవడంతో ఆయన తలకు బలమైన గాయం అయ్యి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా సిద్ధిపేట జిల్లాతో పాటూ వరంగల్, జనగామ జిల్లాల్లోనూ కోతుల బెడద విపరీతంగా పెరిగిపోతోంది. అడవుల్లో చెట్లపై ఉండాల్సిన కోతులు ఇలా రోడ్ల మీదకు రావడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.
Also Read :యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ
 
 Follow Us
 Follow Us