కొడాలి నానికి బిగ్ షాక్.. లా స్టూడెంట్ ఫిర్యాదుతో కేసు నమోదు!

కొడాలి నానిపై ఏయూ లా విద్యార్దిని ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియాల్లో దుర్భాషలాడారని ఆమె ఆరోపించింది. శనివారం రాత్రి విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

former minister Kodali Nani
New Update

గత వైసీపీ హయాంలో ప్రతిపక్ష నాయకులపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి ప్రస్తుతం జైలుకు పంపిస్తున్నారు. ఇప్పటికే బోరుగడ్డ అనిల్ను జైలుకు పంపించగా.. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి నోటీసులు అందించారు. అలాగే మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధమైంది. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

కొడాలి నానిపై కేసు నమోదు

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్‌లను కొడాలి నాని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని ఓ విద్యార్తిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ చేసిన ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ హయాంలో ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాల్లో వాడిన భాషపై ఆమె ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను అవమానపరిచే విధంగా అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

కొడాలి వ్యాఖ్యలు వారి పరువుకి భంగం కలిగించడమే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా వారి గౌరవాన్ని దెబ్బతీశాయని ఫిర్యాదులో తెలిపింది. కొడాలి నాని తరచుగా మీడియా వేదికల్లో, ప్రసంగాల్లో దుర్భాషలు ఆడారని ఆరోపించింది. బాడీ షేమింగ్ వంటి నారాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఒక మహిళగా.. అదీ ఒక లా స్టూడెంట్‌గా ఇలాంటి అసభ్య పదజాలం వినడం, చూడటం చాలా బాదేసిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే యువత ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉందని ఫిర్యాదులో తెలిపింది. 

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

#social-media #ycp #kodali-nani
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe