/rtv/media/media_files/2024/12/06/DphnIb79InJ0Nw86gCUr.jpg)
టీడీపీ రఘు రామకృష్ణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం ఆయన ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ సీఎం.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘరామ కృష్ణం రాజు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రఘరామ కృష్ణం రాజుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయనపై గత ప్రభుత్వం అనేక దేశద్రోహ కేసు పెట్టింది. రఘరామ కృష్ణం రాజు ఎన్నికల కంటే ముందు టీడీపీ లోకి వచ్చాడు.
ఇది కూడా చదవండి : కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్!
టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ సీపీ పార్టీలో ఉన్నప్పుడే ఆయన్ని అదే ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో ఉన్న మంత్రులకు ఏయే సదుపాయాలు ఉంటాయో అవే సదుపాయాలు ఇప్పటి నుంచి రఘు రామ కృష్ణం రాజుకు ఉంటాయి.
రఘురామ కృష్ణంరాజు 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పీ.వీ.ఎల్. నరసింహరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అంతకు ముందు 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేసి సాధించారు.
ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం