‘భయ్య ఒక టీ’ అంటూ రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కానిస్టేబుల్‌కు ఆర్డర్ వేసిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ తర్వాత మరో కానిస్టేబుల్ వచ్చి కాసేపు అనిల్‌తో మాట్లాడటం వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో జరిగింది. అనిల్ కుమార్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన రెండు మూడు వీడియోలు ఇటీవల లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు
3 నిమిషాల 58 సెకన్ల వీడియో
ఇక ఇప్పుడు మరో రాచమర్యాదలకు సంబంధించిన వీడియో ఆదివారం బయటకు రావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ తతంగం అంతా ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతుందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా 3 నిమిషాల 58 సెకన్ల నిడివితో బయటకొచ్చిన ఈ ఫుటేజ్‌లో బోరుగడ్డ అనిల్ అలాగే కానిస్టేబుల్లు కనిపిస్తున్నారు. ‘భయ్యా ఒక టీ’ అని ఆర్డర్ ఇవ్వటం.. వెంటనే కానిస్టేబుల్ టీ తెచ్చి ఇవ్వడం.. మరో కానిస్టేబుల్ వచ్చి కాసేపు అనిల్‌తో మాట్లాడటం అంతా వీడియోలో ఉంది.
ఇది కూడా చదవండి: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!
ఇదంతా ఒకెత్తయితే.. అదే సమయంలో ఒక సాధారణ నిందితుడ్ని స్టేషన్లు నేలమీద కూర్చోబెట్టిన పోలీసులు.. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌ను కుర్చీమీద కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇది ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఈ వ్యవహారం పై అధికారులకు తెలియకుండానే ఉంటుందా? దీని వల్ల కానిస్టేబుళ్ల మీదే చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన డీఎస్పీ అనిల్‌ను సీఐ గదిలో కూర్చోబెట్టి విచారించారని ఇటీవల సస్పెండ్ అయిన ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక రౌడీషీటర్ అనిల్ కుమార్‌ను ఇలా రాచమర్యాదలతో ట్రీట్ చేసిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...!