అమరావతి:
వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఇటీవల పోలీసులు రాచమర్యాదలు చేశారు. కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లి.. తిరిగి వస్తుండగా హోటల్ వద్ద ఆపారు. ఆపై అనిల్ కుమార్ కు గుమగుమలాడించే బిర్యాని తినిపించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 7గురు పోలీసులను డీజీపీ సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు మళ్లీ అదే తప్పు చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారంలో మరోసారి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరుగడ్డకు మరోసారి పోలీసులు రాచమర్యాదలు చేశారు. ఏకంగా సిబ్బంది దగ్గరుండి కుర్చీలు వేసి అన్నం వడ్డించారు.
Also Read : ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
అంతేకాకుండా కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. అక్కడితో ఆగకుండా పడుకోవడాని ప్రత్యేకంగా బల్ల, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బోరుగడ్డకు పోలీసుల బిర్యానీ దావత్
దాడులు, దౌర్జన్యాలతో బోరుగడ్డ అనిల్ పై ఎన్నో కేసులు ఉన్నాయి. వీటికి తోడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై అసభ్యకర వ్యాఖ్యలు, అలాగే వారి కుటుంబ సభ్యులపై కూడా నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడటంతో మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాకుండా గతంలో తుళ్లూరు పోలీస్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న అనిల్ కుమార్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.
Also Read : సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!
అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు బయల్దేరారు. తిరిగి వెళుతున్న క్రమంలో గన్నవరం సమీపంలోని ఓ లగ్జరీ హోటల్ వద్ద ఆగి భోజనం చేశారు. కాగా పోలీసులు తమతో పాటు బోరుగడ్డ అనిల్ ను మర్యాదగా, గౌరవంగా లోపలకి తీసుకెళ్లారు. అక్కడితో ఆగకుండా తమతో పాటే అనిల్ కు మంచి భోజనం ఏర్పాటు చేయించారు. బిర్యానీ, చికెన్ లతో భోజనం పెట్టించారు.
ఈ వ్యవహారాన్నంతటిని వీడియో తీస్తుండగా కొందరినీ బెదిరించారు. కానీ అప్పటికే వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. ఇక ఈ విషయం డీజీపీ ద్వారకా తిరుమల రావు వద్దకు చేరుకోగా ఆయన పోలీసులపై తీవ్రంగా మండిపడ్డాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీపీ అరగంట వ్యవధిలోనే సంబంధిత ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశాడు.
Also Read : సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!
Also Read: విజయవాడ to శ్రీశైలం సీ ప్లేన్ టూర్ ప్రారంభం.. నిమిషాల్లో చేరుకోవచ్చు