దారుణం.. పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేసి బలిచ్చారు.. షాకింగ్ ఫొటోస్!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

New Update
Black Magic

ప్రస్తుత ఆధునిక కాలంలో మానవుడు భూమి నుంచి ఆకాశానికి చేరుకునేంత టెక్నాలజీని కనుగొన్నాడు. కానీ కొందరు మాత్రం మూఢ నమ్మకాల పేరుతో చంపుకు చస్తున్నారు. చేతబడి, క్షుద్రపూజలు వంటి మూఢ నమ్మకాలతో బతుకుతున్నారు. వ్యాపారం బాగా జరగాలని జంతువులను బలిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా కనీసం చైతన్యం రావడం లేదు.

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

బలిచ్చి క్షుద్ర పూజలు

తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన సంఘటన జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. 

NTR District

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

అదే సమయంలో నాగరాజు అనే వ్యక్తి తన 3 మేకలు కనిపించపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగానే మేకల కోసం వెతుకుతుండగా తన మేకలే బలిచ్చినట్లు నాగరాజు గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్షుద్ర పూజలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

NTR District..

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

ఇదిలా ఉంటే మరోవైపు నందిగామ నుంచి 15 కి.మీ దూరంలో గుడిమెట్ల గ్రామానికి సమీప ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఆ సమీప ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగుతుంది. దాదాపు రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకి వజ్రాల వేటకు వేలాది జనం వస్తుంటారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు