/rtv/media/media_files/2025/11/08/viveka-2025-11-08-11-07-56.jpg)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(ys-viveka-murder) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై గతంలో తప్పుడు కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులపై (విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డి) తాజాగా కేసు నమోదు చేశారు. తప్పుడు కేసుగా నిర్ధారించిన తర్వాత, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో తప్పుడు కేసులుపై పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ విచారణ చేపట్టారు. ఎనిమిది నెలల విచారణలో మొత్తం 22 మంది సాక్షులను విచారించారు. తప్పుడు కేసులపై క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇద్దరు పోలీసులు పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని సునీతకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరుగుతోంది.
Also Read : కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్‌లో పదిమంది
పులివెందులలోని తన ఇంట్లో
వైఎస్ వివేకానందరెడ్డి(ys vivekananda reddy case)ని 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్య చేశారు. తొలుత రాష్ట్ర పోలీసులు (సిట్) దర్యాప్తు చేశారు. అయితే, వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అభ్యర్థన మేరకు, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఈ హత్య వెనుక రాజకీయ, ఆర్థిక కోణాలు, ఆస్తి వివాదాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి అప్రూవర్‌గా (సాక్షిగా మారి) సంచలన వాంగ్మూలం ఇచ్చారు. హత్యకు కుట్ర ఎలా జరిగింది, ఎవరు ప్లాన్ చేశారు, ఎంత సుపారీ ఇచ్చారు అనే వివరాలు వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు ముఖ్య సాక్షులు ( వాచ్‌మ్యాన్ రంగన్న) మరణించడం కూడా కేసును మరింత క్లిష్టతరం చేసింది.
Also Read : ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్‌మెన్ లైంగిక దాడి!
Follow Us