/rtv/media/media_files/2025/02/02/f9RYdKC66kgCwHV6p4FQ.webp)
YS Sharmila Vijaya Sai Reddy
Y. S. Sharmila : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో బేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్లు టాక్ వస్తోంది. వీరిద్దరి మధ్య దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగినట్లు తెలిసింది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌లో హైలెట్స్ ఇవే!
కాగా వీరి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. అంతేగాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోతానని కూడా ప్రకటించుకున్నారు.అయితే అనుహ్యంగా షర్మిలతో భేటీ కావడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ప్రస్తుత రాజకీయాలపై చర్చించిన అనంతరం భవిష్యత్తులో షర్మిలతో కలసి పనిచేయాలని విజయసాయి నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది.అయితే తన సోదరి షర్మిలతో సయోధ్య కోసమే జగన్ విజయసాయి రెడ్డిని షర్మిల వద్దకు పంపించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.
Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
కాంగ్రెస్‌తో విబేధాల నేపథ్యంలో భయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీ పెట్టుకున్న వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేశారు. విభజన అనంతరం ఏపీకే పరిమితమైన జగన్ తొలి ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. జగన్ మీద ఉన్న కేసుల నేపథ్యంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల పాదయాత్రను కొనసాగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో అనుహ్యంగా 156 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కేవలం ఘోర పరాజయంతో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబంలో నెలకొన్న విబేధాల నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సోదరి వైఎస్ షర్మిల మధ్య దూరం పెరిగింది.దీంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అనుహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియ మితులయ్యా రు. ఈ క్రమంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారు. తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
తాజాగా వైసీపీకీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి షర్మిలతో బేటీ కావడం పై సర్వత్రా చర్చనీయంశంగా మారింది. కాగా ఏపీ రాజకీయాల్లో వీరి సమావేశం కొత్త చర్చకు దారితీసింది.