/rtv/media/media_files/2025/02/10/rTD3kRrn1eINvnMhmjCl.jpg)
Supreme Court of India
Supreme Court: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విచారణను సుప్రీంకోర్టు వేగవంతం చేయనుంది.జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టనుంది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధుల కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించు కోకపోవడంపై రాష్ర్ట ప్రభుత్వాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపైనా అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని అనుమతించి సుప్రీం కోర్టు ఈరోజు (సోమవారం) విచారణ చేపట్టింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్‌మోహన్‌ల ధర్మాసనం విచారణ నిర్వహించింది.
Also Read:Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు!
సుప్రీంకోర్టు పరిధిలోని కేసులు విచారించాలని అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. అమికస్‌క్యూరీ విజయ్ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. తన నివేదికలో పేర్కొన్న అనేక విషయాలను కోర్టుకు అమికస్‌క్యూరీ నివేదించింది. కొన్ని చోట్ల 30 ఏళ్ల నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తన వాదన వినిపించారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఇప్పటికీ లేవు. మిగిలిన కేసులతో కలిపి విచారణ చేస్తున్నారు తప్ప... ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని అమికస్ క్యూరీ కోర్టుకు తెలిపారు. దేశంలో వందలాది ప్రజా ప్రతినిధుల కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణం ప్రత్యేకంగా విచారించే కోర్టులు లేకపోవడం ఒకటేనని తేల్చి చెప్పింది.. నిందితులుగా ఉన్న వారు ఏళ్ల తరబడి కోర్టుల్లో విచారణకు హాజరుకాకపోవడం కూడా మరో కారణమని వివరించింది.ఇప్పటి వరకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సహా ఇతర ప్రజా ప్రతి నిధులు వరుసగా రెండు సార్లు హాజరుకాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని అమికస్ క్యూరీ కోరారు.
Also Read:Sankranthiki Vasthunam: వావ్! అప్పుడే టీవీలో వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'..! నవ్వులే నవ్వులు
చాలా మంది ప్రజాప్రతినిధులపై డ్రగ్స్, ఆహార కల్తీ, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్.. కోర్టుకు చెప్పారు. 46, 47 మంది ఎంపీలపై కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయని లాయర్ వికాస్ సింగ్ తెలిపారు. ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేర చరిత్ర ఉన్న వారిని తమ కార్యవర్గంలో (ఆఫీస్ బేరర్‌గా కూడా) ఉంచకుండా ఈసీ నిబంధనలు విధించాలని అమికస్‌క్యూరీ కోరారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల విచారణ వేగవంతంపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read:కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి.. విద్యార్థులతో ప్రధాని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్