Nandigam Suresh: నందిగం సురేష్ కు బెయిల్.. కోర్టు కండిషన్లు ఇవే!

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు రూ.10 వేల చొప్పున 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. మరియమ్మ కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్.. బెయిల్ రావడంతో ఐదు నెలల తర్వాత విడుదల కానున్నారు.

New Update
Nandigam Suresh Bail

Nandigam Suresh Bail

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గతేడాది సెప్టెంబర్‌లో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మరియమ్మ మర్డర్ కేసులో అక్టోబరు 7న పీటీ వారెంట్‌పై మరోసారి అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ కోసం నందిగం సురేష్ విశ్వ ప్రయత్నాలు చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 7న డిస్మిస్ చేసింది.
ఇది కూడా చదవండి:YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. ఎంపీ అయోధ్య సంచలన వ్యాఖ్యలు!

దీంతో గుంటూరు నాలుగో జిల్లా కోర్టులో సురేష్ తరఫున తానికొండ చిరంజీవి అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేశారు.  ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ చేసిన గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున 2 ష్యూరిటీలను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి:Chandra babu: ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం

మరియమ్మ కేసు ఏంటి?

2020 డిసెంబర్‌లో తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య జరిగింది. ఆ సమయంలో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మరియమ్మ మృతి చెందారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. ఆ సమయంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ను పోలీసులు 78వ నిందితుడిగా నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు