బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 2016 ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం ఏపీ ప్రభుత్వం ఆమెను ఘనంగా సత్కరించింది. అంతేకాకుండా ఇంటి స్థలం, నగదు నజరానాతో పాటు డిప్యూటీ కలెక్టర్‌గా ఆమెను ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆమెకు అందించారు.
ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!
తెలంగాణ ప్రభుత్వం సత్కారం
అనంతరం పీవీ సింధూ డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో విధుల్లో చేరారు. అయితే ఏపీ ప్రభుత్వమే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వం సైతం పీవీ సింధూని ఘనంగా సత్కరించింది. ఆమెకు హైదరాబాద్‌లో ఇంటి స్థలంతో పాటు నగదు నజరానా కూడా అందించింది.
ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వం పీవీ సింధుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆమెకు ఆన్‌డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. త్వరలో ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు 2025-26లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు ఆమె సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చూడండి: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్
వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
దీంతో శిక్షణ నిమిత్తం ఆమెకు ఓడీ (ఆన్ డ్యూటీ) సదుపాయాన్ని కల్పించారు. ఈ మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని ఆరోసారి పొడిగించారు. కాగా ప్రస్తుతం పీవీ సింధు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథిగృహంలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా ఓ వైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా.. మరోవైపు డిప్యూటీ కలెక్టర్‌గా పీవీ సింధు దూసుకుపోతున్నారు.
ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్